ఈ లక్షణాలు ఉంటే మీ కిడ్నీలు ఎందుకు పనికి రావని అర్థం!
Dharmaraju Dhurishetty
Nov 13,2024
';
చాలామందిలో కిడ్నీ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను పెరగడానికి ప్రధాన కారణాలేంటి..
';
తెలిసి తెలియక ఆధునిక జీవనశైలి పాటించడం, ఇతర అనారోగ్య కారణాల వల్లే కిడ్నీ సమస్యలు వస్తున్నాయి.
';
చాలామందిలో కిడ్నీలు దెబ్బ తినడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ .. ఆధునిక జీవనశైలి పాటించడమే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
కిడ్నీలు ఫెయిల్ అవ్వకముందు కొంతమందిలో శరీరం కొన్ని హెచ్చరికలను జారీ చేస్తుంది. అవి మనకు లక్షణాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి.
';
కిడ్నీలు దెబ్బతినకు ముందు వస్తే ముందస్తు లక్షణాలు ఏంటో.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి..
';
కొంతమందిలో కిడ్నీలు దెబ్బతినే ముందు మూత్ర విసర్జన చేసే క్రమంలో రక్తం, చక్కెర వర్ణంతో కూడిన నురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
';
మరికొంతమందిలోనైతే కిడ్నీలు దెబ్బ తినే క్రమంలో మూత్రం తరచుగా రావడం, రాకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
';
వయస్సు పైబడిన వారిలో కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత మూత్రం వాసన కూడా వస్తుంది.
';
అలాగే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు కొంతమందిలో శరీరంలోని నీటి శాతం పెరుగుతూ ఉంటుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం పై వాపులు కూడా వస్తాయి.
';
అలాగే కిడ్నీలు పాడు కాకముందే ముందస్తు లక్షణాలుగా కొంతమందిలో నిద్రలేచినప్పటికీ అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి.
';
మరికొంతమందిలో కిడ్నీలు పాడయే ముందు చర్మం పై రంగు మారడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
';
మరికొంతమందిలోనైతే తల తిరగడం, మైకం వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.