హోటల్ స్టైల్ ఫిష్ ఫ్రై.. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
ముందుగా చేపలను ఉప్పు, మిరియాలతో బాగా కడగాలి.
ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన చేపలను పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో అరకప్పు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి.
అందులో ఒక చెంచా వంటనూనె, ఉప్పు కూడా వేసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత చేపలను తీసుకుని.. ఆ చేపలపై మసాలాను రాయాలి.
మసాలా రాసిన తరువాత చేపలపై కొద్దిగా నిమ్మరసం వేసి, బియ్యప్పిండి రాసి బాగా కలపాలి. ఇదంతా అయ్యాక ఒక గంట సేపు చేపలని అలానే వదిలేయండి.
ఒక గంట తర్వాత ఈ చేపలను తక్కువ మంటలో వేసి నూనెలో వేయించాలి. రెండు వైపులా బాగా కాల్చుకోండి.
అంతే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ.