నీటిని సరైన రీతిలో తాగడం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజుకి ఎంత నీరు తాగాలో, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
నీరు తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసా? నీరు మన శరీరానికి అత్యవసరం. రోజుకు సరైన మోతాదులో నీరు తాగడం, మీ బరువు తగ్గించే ప్రణాళికలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
రోజుకు ఎంత నీరు తాగాలి? బరువు తగ్గాలంటే రోజుకి కనీసం 8 గ్లాసులు నీరు తాగడం మంచిది. దీని ద్వారా శరీరంలో మలినాలు తొలగించబడతాయి. మెటబాలిజం వేగం పెరుగుతుంది.
నీరు మీ శరీరంలో మలినాలను బయటికి పంపుతుంది. ప్రతి భోజనం ముందు ఒక గ్లాస్ నీరు తాగడం వలన, మీరు తినే ఆహారం తక్కువగా ఉంటుంది, తద్వారా క్యాలరీలు కూడా తగ్గుతాయి.
వేడి నీరు తాగడం ద్వారా కొవ్వు కరిగించడంలో సాయం అవుతుంది. ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిని తాగడం మంచి అలవాటు.
ఎక్కువ నీరు తాగడం కూడా మంచిది కాదు. అతి నీరు తాగితే జలదాహం అనే సమస్య తలెత్తుతుంది, అందుకే సరైన మోతాదులో తాగడం అవసరం.
పైన చెప్పినవి అధ్యాయనాలు, వైద్య నిపుణులు సలహాలు మేరకు చెప్పినవి మాత్రమే.. జీ విటికే ఎటువంటి బాధ్యత వహించదు.