క్రిస్పీ దోశ కోసం పిండి సరిగ్గా చేసుకోవాలి అలానే పిండి సరిగా కలుపుకోవాలి. నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు బుద్ధి పప్పు, రెండు టీ స్పూన్లు పచ్చనగపప్పు, ఒక టీ స్పూన్ మెంతులు, గుప్పెడు అతుకులు, గుప్పెడు సగ్గుబియ్యం వేసుకుని పిండిని తయారు చేసుకోవాలి.
పిండి రాత్రంతా పులియబెట్టిన తర్వాత ఉదయాన్నే దాన్ని.. నీళ్లు పోసుకు కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఈ పిండి వల్ల దోశ నూనె వెయ్యకపోయినా కానీ పెనుమ మీద నుంచి బాగా వస్తుంది. కావాలంటే నూనె లేకుండా దోశ చేసేందుకు నాన్‌స్టిక్ పాన్ ఉపయోగించడం మంచిది. పాన్ తక్కువ మంటపై
పిండి కొంచెం తీసుకొని, పాన్ పై బాగా పలచగా వెయ్యాలి. ఇది దోశ క్రిస్పీగా ఉండటానికి సహాయపడుతుంది.
మంట తక్కువగా ఉంచి, దోశ రెండువైపులా గోధుమ రంగు వచ్చే వరకు కాల్చాలి.
క్రిస్పీ దోశను పచ్చడి లేదా సాంబార్తో వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
పిండిలో ఒక చెంచా రవ్వ కలిపితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
ఇది తక్కువ కాలరీలతో, ఆరోగ్యకరమైన శక్తినిచ్చే ఆహారం.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, నిపుణుల సలహాల మేరకు మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.