కంటి చూపు సమస్యలతో బాధపడేవారు క్యారెట్‌తో కూడిన ఆహారాలు తినడం చాలా మంచిది.
';
క్యారెట్‌లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
';
క్యారెట్‌తో కూడిన పరాటాలను తినడం వల్ల కూడా అనేక సమస్యలు దూరమవుతాయి.
';
క్యారెట్ పరాటాను మీరు కూడా తినాలనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి.
';
క్యారెట్ పరాటా తయారీకి పదార్థాలు: గోధుమ పిండి - 2 కప్పులు, క్యారెట్లు - 2 (తరగన), ఉల్లిపాయ - 1 (చిన్నగా తరగన), ఆవాలు - 1/2 టీస్పూన్
';
తయారీకి పదార్థాలు: జీలకర్ర - 1/4 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగితే మంచిది), నెయ్యి - తగినంత
';
తయారీకి పదార్థాలు: ఉప్పు - రుచికి తగినంత, పసుపు - చిటికెడు, కారం - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 ఇంచ్ అల్లం, 2-3 రేబలు వెల్లుల్లి
';
తయారీ విధానం..కూర తయారీ: ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసుకుని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి పప్పులు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి వేగించాలి.
';
ఆ తర్వాత ఉల్లిపాయ వేసి బంగారు రంగులోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగించాలి.
';
తర్వాత క్యారెట్ తురుము వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి వేగించాలి. క్యారెట్ ముక్కలు మృదువుగా అయ్యే వరకు వేగించాలి.
';
పిండి కలిపే విధానం: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేడి నీరు వేస్తూ పిండిని కలుపుతూ రోటీల పిండిలా తయారు చేసుకోండి.
';
పరాటాలు చేయడం: పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతి ఉండను తీసుకొని చపాతీలా సన్నగా రోల్ చేసి, ముందుగా తయారు చేసిన కూరను పెట్టుకుని దానిని మళ్ళీ చుట్టలా చేసి, చపాతీలా రోల్ చేయాలి.
';
ఆ తర్వాత రెండు వైపులా ఈ పరాటాలను వేయించుకుంటే.. రెడీ అయినట్లే..