రూపాయి ఖర్చు లేకుండా బ్యూటీ పార్లర్ వెళ్లకుండా మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే బంగాళదుంపలతో ఇలా చేయండి.
బంగాళదుంపలో ఉండే విటమిన్లు, మూలకాలు మీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
బంగాళాదుంపలను దినచర్యలో భాగం చేసుకుంటే ఆరోగ్యంతోపాటు అందం సొంతం అవుతుంది.
ఆలును బాగా కడిగి వాటిపై ఉండే పీల్ తిసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి.ఈ పేస్టును ఫిల్టర్ చేసుకోవాలి. ఒక కంటైనర్లో బంగాళాదుంప రసాన్ని తీసుకోవాలి.
ఇప్పుడు ఈ రసంలో దూది ముంచి మీ ముఖం, మెడపై అప్లై సున్నితంగా మసాజ్ చేసుకోండి.
ఒక గంటపాటు అలాగే వదిలేయాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
ఈ బంగాళాదుంప వాటర్ తో మీ ముఖాన్ని డీప్ క్లీన్ చేస్తే కొన్ని రోజులు తర్వాత ముఖంలో గ్లో వస్తుంది.
బంగాళాదుంపతో ఇలా నిత్యం చేసినట్లయితే ముఖంపై ఉన్న మొండి మచ్చలను చాలా వరకు తొలగించుకోవచ్చు.