చిన్నపిల్లలకు ఎంతో నచ్చే బెల్లం బిస్కెట్లు చేయడం కోసం.. ఒకటిన్నర కప్పు గోధుమపిండి, అర కప్పు బెల్లం పొడి ఒక బౌల్లో వేసుకోండి.
అందులోనే రుచికి సరిపడా ఉప్పు, సగం చెంచా బేకింగ్ పౌడర్, 100 గ్రాముల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి.
అన్నీ బాగా కలిసిపోయేలా ఒకసారి కలియబెట్టాలి. ఇప్పుడు నెయ్యి లేదా బటర్ కూడా వేసుకుని ఒకసారి చేత్తోనే గట్టిగా కలపాలి. ఇందులోనే రెండు చెంచాల పాలు కూడా వేసి కలుపుకోండి.
ఇప్పుడు ఈ పిండిని ముద్దలాగా చేసుకొని చపాతీలా రుద్దుకొండి. ఆ తర్వాత చాకు సాయంతో మీకిష్టమైన ఆకారంలో కట్ చేసుకోండి.
వీటిని ఓవెన్ ఉంటే.. 160 డిగ్రీల వద్ద.. పావు గంట సేపు ప్రిహీట్ చేసుకుంటే బిస్కట్లు రెడీ అవుతాయి.
ఒకవేళ ఓవెన్ లేకపోతే.. కుక్కర్ పెట్టుకొని అందులో సగం కేజీ దాకా ఉప్పు పోసుకోవాలి. ఉప్పు కొంచెం వేడెక్కిన తర్వాత.. పది నిమిషాలు మీడియం మంట మీద వేడి చేశాక.. దానిపైన ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకోవాలి.
ఆ స్టాండ్ మీద ముందుగా చేసుకున్న.. బిస్కట్లు పరిచి పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం మంట మీద పావుగంట సేపు వదిలేస్తే.. బిస్కట్లు బేక్ అయిపోతాయి.