రాఖీ పండుగ రోజు.. సోదరికి సోదరుడు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చే.. ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే అందుకోసం ఖరీదైన బహుమతులు కొనే డబ్బులు మీ దగ్గర లేకపోతే.. కానీ మీ సోదరి మీ గిఫ్ట్ చూసి ఎంతో ఆనందించాలి అనుకుంటే.. ఈ ఐడియాస్ ఒకసారి చూసేయండి..
వెయ్యి రూపాయలకన్నా తక్కువ ధరలోనే.. ఫిట్‌నెస్ బ్యాండ్స్ దొరుకుతున్నాయి. ఇలా తన ఆరోగ్యం కోసం సాయపడేట్లు.. ఈ బహుమతిని ఇవ్వచ్చు.
అమ్మాయిలకు ఆభరణాలు అంటే ఎంతో ఇష్టం. నీకోసం బంగారం, వెండి కొనక్కర్లేదు. మార్కెట్లో లభించే ఆర్టిఫిషియల్ కస్టమైజ్డ్ జ్యువెలరీ కొని ఇవ్వండి.
అంతేకాదు మీ సోదరి రాశికి అదృష్టం తెచ్చే.. సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఉందే జువెలరీస్ కూడా దొరుకుతాయి. అలాంటిది కొనిచ్చిన వారు ఎంతో సంతోషపడుతారు.
అమ్మాయిలకి స్కిన్ కేర్ ఎక్కువే. అయితే ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ శాంపుల్ సైజ్ కిట్స్ లో లభిస్తాయి. అవి కొనిస్తే వారు తప్పకుండా సర్ప్రైజ్ ఫీలవుతారు.
అమ్మాయిలకు ఇల్లు ఎంతో అందంగా పెట్టుకోవడం ఇష్టం. అందుకు సరిపోయే దత్తు.. డెకరేటివ్ పీసెస్, ఫ్యాన్సీ లాంతర్లు, కప్ సెట్స్, బెడ్ లైట్స్ లాంటివి.. ఇలా చాలానే ఇవ్వచ్చు.
ఇవేవీ మీకు నచ్చకపోతే.. మీరు ఇవ్వాలి అనుకున్నంత డబ్బులతో..ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ గిఫ్ట్ కార్డు కొని తనకు ఇచ్చేయండి. తను ఎంచక్కా తనకు ఇష్టమైంది కొనుక్కుంటుంది.