ఐరన్‌ లోపాన్ని పోగొట్టే మ్యాజిక్ పకోడీ.. రోజు స్నాక్‌గా తింటే బోలెడు బెనిఫిట్స్!

Dharmaraju Dhurishetty
Jan 01,2025
';

ముఖ్యంగా పాలకూరతో తయారుచేసిన పకోడీ తినడం వల్ల ఐరన్ లోపంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

';

పాలకూరతో చేసిన పకోడీ తింటే ఆకుల్లో ఉండే అన్ని రకాల పోషకాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.

';

ప్రస్తుతం చాలామంది ప్రోటీన్ లోపం సమస్యతో బాధపడుతూ ఉన్నారు అయితే స్నాక్‌గా దీనిని తినడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

హోటల్స్లో లభించే పాలకూర పకోడీ కంటే దీనిని ఇంట్లోనే తయారు చేసుకొని తినడం ఎంతో మంచిది.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పాలకూర పకోడీని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా..?

';

పాలకూర పకోడీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు: పాలకూర - 1 కప్పు (సన్నగా తరిగిన), శనగపిండి - 1 కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగిన)

';

పాలకూర పకోడీ తయారీ విధానం: అల్లం - 1/2 అంగుళం (సన్నగా తరిగిన), కరివేపాకు - కొద్దిగా, జీలకర్ర - 1/2 టీ స్పూన్, వాము - 1/4 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి

';

తయారీ విధానం: ఈ పాలకూర పకోడీని తయారు చేయాలనుకునే వారు ముందుగా ఒక గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది. ఆ గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర, వాము అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి.

';

ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న ఐదు నిమిషాల తర్వాత తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఓ పది నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి.

';

ఇలా పక్కన పెట్టుకున్న పిండిలో తరిగిన పాలకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మరో 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.

';

ఆ తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని పిండి మిశ్రమాన్ని నూనెలో వేసుకుని బాగా వేపుకోండి. అంతే పాలకూర పకోడీ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story