కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆహారం.. తయారీ విధానం ఇదే!

Dharmaraju Dhurishetty
Aug 24,2024
';

దద్దోజనం కృష్ణుడికి నైవేదంగా సమర్పించడం ఎంతో శుభప్రదం..

';

మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున దద్దోజనాన్ని నైవేదంగా సమర్పించాలనుకుంటున్నారా?

';

దద్దోజనం తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు..

';

అవసరమైన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, పెరుగు - 2 కప్పులు, పాలు - 1/2 కప్పు (మరిగించినవి)

';

కావాల్సిన పదార్థాలు: ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్

';

కావాల్సిన పదార్థాలు: ఇంగువ - చిటికెడు, కరివేపాకు - కొన్ని రెబ్బలు, మినపప్పు - 1/2 టీస్పూన్, శనగపప్పు - 1/2 టీస్పూన్, మిరియాలు - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం రైస్‌ తయారీ: బియ్యాన్ని కడిగి 20 నిమిషాలు నానబెట్టండి. రైస్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి.

';

పాలు కలపడం: వండిన బియ్యాన్ని గరిటతో మెత్తగా కలిపి, మరిగించిన పాలు వేసి బాగా కలపండి.

';

పెరుగు కలపడం: అన్నం చల్లారిన తర్వాత, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపండి.

';

తాలింపు: చిన్న కడాయిలో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించండి.

';

తాలింపు కలపడం: ఈ తాలింపును పెరుగన్నంలో వేసి బాగా కలపండి.

';

సర్వ్ చేయడం: దద్దోజనాన్ని ఒక పాత్రలో వడ్డించి, పైన కొత్తిమీర తరుగును అలంకరించి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story