ఉడకబెట్టిన గుడ్లు -5 కార్న్ ఫ్టోర్- 3TBSp మైదా-1TBSP ఉప్పు- రుచికిసరిపడా
కారం- 3TBSP అల్లంవెల్లుల్లి-1TBSP ధనియాలపొడి-1TBSP జిలకర్రపొడి- 1TBSP నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
ఉడకబెట్టిన గుడ్లలో నుంచి తెల్లటి భాగాన్ని తీసుకోండి.
ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లితోపాటు మిగతా అన్ని పదార్థాలను కలుపుకోవాలి.
మీకు కావాలనిపిస్తే కొద్దిగా నీళ్లను కూడా వేసుకుని బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు గుడ్లలోని తెల్లటి భాగాన్ని కట్ చేసుకోవాలి. వీటిని బజ్జీల పిండిలో వేసుకొని కలపాలి.
స్టవ్ ఆన్ చేసి బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి. మంట మీడియంలో ఉండాలని గుర్తుంచుకోండి
ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని మెల్లిమెల్లిగా నూనెలో వేసుకోవాలి. వీటిని మీడియం మంట మీదనే వేయించాలి.
చివరగా ఎగ్ 65 రెడీ అయినట్లే, ఒక ప్లేట్‌లోకి వీటిని తీసుకుంటే సరిపోతుంది. ఎగ్ 65 రెడీ అయినట్లే..