బరువు తగ్గించే కిచిడీ.. రుచి వేరే లెవల్‌!

Dharmaraju Dhurishetty
Jul 25,2024
';

మిల్లెన్స్‌తో వివిధ రకాల ఆహారాలు తయారు చేసుకుంటారు.

';

మిల్లెన్స్‌తో తయారు చేసిన కిచిడీని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

';

ఈ కిచిడీలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.

';

ముఖ్యంగా మిల్లెన్స్‌ కిచిడీలో ఎక్కువగా ఫైబర్‌ లభిస్తుంది. ఇది శరీర బరువును కూడా తగ్గిస్తుంది.

';

ఈ కిచిడీని రోజు తినండ వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

';

మిల్లెన్స్‌ కిచిడీ మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

మిల్లెన్స్‌ కిచిడీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు మిల్లెన్స్‌, 1/2 కప్పు పెసరపప్పు, 3 కప్పుల నీరు, 1/2 టీస్పూన్ జీలకర్ర

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ మెంతులు, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ కారం

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ గరం మసాలా, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి

';

కావలసిన పదార్థాలు: 1/2 కప్పు కూరగాయలు (క్యారెట్, బఠానీలు, మొలకలు, మీకు ఇష్టమైనవి), 1/4 కప్పు తరిగిన కొత్తిమీర

';

తయారీ విధానం: మిల్లెన్స్‌, పెసరపప్పులను కలిపి శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో మిల్లెన్స్‌, పెసరపప్పు, నీరు బాగా కలపాలి.

';

ఒక ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేడి చేసి, అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి వేసి వేయించాలి.

';

జీలకర్ర వేయించిన తరువాత కూరగాయలు వేసి 2 నిమిషాలు వేయించాలి.

';

ఆ తర్వాత నానబెట్టిన మిల్లెన్స్‌, పెసరపప్పు మిశ్రమం వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత 3 కప్పుల నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 వీసళ్ళు వచ్చే వరకు ఉడికించాలి.

';

కుక్కర్ చల్లబడిన తర్వాత మూత తీసి, నెయ్యి, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

';

వేడిగా ఘుమఘుమలాడే కిచిడీని పెరుగు లేదా చట్నీతో కలిపి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story