Baldness Remedy: మీరు బట్టతలతో బాధపడుతున్నారా..ఇక ఆ సమస్యకు చెక్, మందు వచ్చేసింది
బట్టతల సమస్య ఇటీవల బాగా పెరిగింది. అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. కానీ ఓ ఆయుర్వేద మూలికతో ఈ సమస్యకు పూర్తిగా చెక్ చెప్పవచ్చు. బట్టతల నుంచి కూడా జుట్టు మొలిచే చిట్కా ఇది
ఈ మూలిక పేరు జటామాంసీ. శాస్త్రీయంగా స్పైక్ నార్డ్ లేదా నార్డ్ అంటారు
ఇదొక ఆయుర్వేద మూలిక. ఆరోగ్యం కోసం అనాదిగా ఉపయోగిస్తున్నదే
జటామాంసీ హిమాలయ ప్రాంతాల్లోనే లభ్యమౌతుంది. ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి.
మరీ ముఖ్యంగా బట్టతల దూరం చేసేందుకు, కేశాల్ని రూట్స్ నుంచి స్ట్రాంగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. వాస్తవానికి కేశాలకు ఈ చికిత్స అనాదిగా ఉన్నదే
జటామాంసీలో కేశాలకు పోషకాలు అందించే గుణాలున్నాయి. ఇవి కేశాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. రోజూ క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జట్టు పటిష్టంగా మారుతుంది.
ఇది కేశాల రూట్స్ ఉండే రంధ్రాల్ని పటిష్టం చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది
జటామాంసీ ఆయిల్ కేశాలకు చాలా మంచిది. కొబ్బరి నూనె లేదా జైతూన్ ఆయిల్ కలిపి తలకు పట్టించి మాలిష్ చేయాలి
రాత్రంతా ఈ నూనె రాసి వదిలేయాలి. ఉదయం మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3-4 సార్లు చేయాలి