నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది.
మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే షాంపూలో ఈ ఒక వస్తువును కలపడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
షాంపూలో తేనె మిక్స్ చేసి జట్టుకు అప్లయ్ చేసుకుంటే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడమే కాదు..జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.
తేనె జుట్టుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఇస్తుంది. జుట్టుకు మెరుపునిస్తుంది. జుట్టును మెరిచేలా సాఫ్ట్‌గా ఉంటుంది.
మీరు తీసుకునే షాంపూలో తేనె కలపండి. దీన్ని తలకు పట్టించి జుట్టును గోరువెచ్చని నీటితో కడగండి.
ఇలా వారానికి రెండు సార్లు షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.
తేనెతోపాటు మీరు షాంపూలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలపడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.