చాలా మందికి పుట్టగొడుగులు తినడం ఇష్టం. ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి.
పుట్టగొడుగుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలంటూ తెలుసుకుందాం.
ప్రొటీన్, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్ వంటి గుణాలు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి.
పుట్టగొడుగుల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని నిత్యం తింటే అనేక వ్యాధులు నయం అవుతాయి.
పుట్టగొడుగుల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది.
పుట్టగొడుగుల్లో తక్కువ కేలరీలు, కార్బొహైడ్రేట్ కంటెంట్ ఉంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు షుగర్ ను అదుపులో ఉంచుతాయి.
విటమిన్ సితోపాటు అనేక పోషకాలు పుట్టగొడుగుల్లో మెండుగా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటిని పెంచుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న పుట్టగొడుగులు తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పుట్టగొడుగులు ఆహారంలో చేర్చుకుంటే ఆకలి అనిపించదు.