తెల్ల జుట్టు ఉంది నల్ల జుట్టుగా మార్చుకోవడమే కాదు.. మళ్లీ తెల్ల జుట్టు రాకుండా చేసుకోవడం కూడా చాలా కష్టమైన పనే. అయితే ఇలా జరగాలంటే.. కింద చెప్పే మిశ్రమాన్ని.. మీ వెంట్రుకలకు అప్లై చేయండి.
ముందుగా అర చెంచా కొబ్బరి నూనెను.. ఒక పాన్ లో పోసుకొని.. అందులో నాలుగు టీ స్పూన్ల కలోంజి విత్తనాలను వేసుకుని బాగా వేయించుకోండి.
ఆ తరువాత ఆగించ లను మిక్సీకి వేసి బాగా పేస్టులా చేసుకోండి.
ఇప్పుడు ఆ పేస్ట్ లో ఒక టీ స్పూన్ ఉసిరి పొడి, ఒక టీ స్పూన్ భృంగరాజ్ పౌడర్ కలుపుకోండి.
ఇది కలిపేటప్పుడు.. మిశ్రమం మరీ ముద్దగా మారుతుంటే.. కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి.
ఈ మిశ్రమాన్ని పావు గంట సేపు పక్కన పెట్టేసేయండి. అంతే నేచురల్ హెయిర్ డై తయారీ అయినట్లే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తల మొత్తం పెట్టుకోండి.
ఒక మూడు గంటల తర్వాత.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు.. తెల్ల జుట్టు నల్ల జుట్టు గా మారడమే కాదు.. ఆ తరువాత తెల్ల జుట్టు రావడానికి కూడా తగ్గిస్తుంది.