హై ప్రోటీన్‌ నగ్గెట్స్.. డోంట్‌ మిస్‌ దిస్‌ రెసిపీ..

Dharmaraju Dhurishetty
Jan 01,2025
';

చిల్లీ సోయా నగ్గెట్స్ చాలా మంది రెస్టారెంట్లలో తినేందుకు ఆసక్తి చూపుతారు. ఈ రెసిపీని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

';

చిల్లీ సోయా నగ్గెట్స్‌లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని సాయంత్రం స్నాక్స్‌గా కూడా తినొచ్చు.

';

ఈ చిల్లీ సోయా నగ్గెట్స్ తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ప్రోటీన్ అందుతుంది.

';

మీరు కూడా సులభంగా ఇలా చిల్లీ సోయా నగ్గెట్స్‌ను తయారు చేసుకోండి.

';

చిల్లీ సోయా నగ్గెట్స్‌కి కావలసిన పదార్థాలు: సోయా చంక్స్ - 2 కప్పులు, నీరు - 1 కప్పు (వేడి), ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా తరిగిన)

';

కావలసిన పదార్థాలు: మిరపకాయలు - 2-3 (చిన్న ముక్కలుగా తరిగిన), కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగిన), రొట్టె ముక్కలు - 2-3, కొబ్బరి పొడి - 1/4 కప్పు

';

కావలసిన పదార్థాలు: బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి

';

తయారీ విధానం: ముందుగా వీటిని తయారు చేసుకోవడానికి ఒక బౌల్‌లో సోయా చంక్స్‌ను వేసి బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఈ సోయా చంక్స్‌ను నానబెట్టే క్రమంలో తప్పకుండా వేడి నీటిని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

';

ఇలా నానబెట్టిన సోయా చంక్స్‌ నుంచి నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

నానబెట్టిన సోయా చంక్స్‌ను, ఉల్లిపాయ, మిరపకాయలతో పాటు కొత్తిమీర, బ్రెడ్‌ ముక్కలు, కొబ్బరి పొడిని బౌల్‌లో వేసుకుని కలుపుకోండి.

';

ఇలా కలిపిన మిశ్రమంలోనే బియ్యం పిండి, కారం పొడితో పాటు ఉప్పు అన్నీ వేసుకుని మిశ్రమంలా తయారు చేసుకోండి.

';

ఈ మిక్సీ కొట్టుకున్న పిండిని చిన్న చిన్న నగ్గెట్స్‌గా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత కడాయిలో కోల్డ్‌ప్రెస్‌ నూనె వేడి చేసి.. అందులోనే నగ్గెట్స్‌ చేసుకుని వేయించుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story