నూనె కరెక్ట్ గా పెట్టుకుంటే.. జుట్టు ఎదుగుదల సమస్య మటుమాయం అవుతుంది అని మీకు తెలుసా.
అవును.. నూనె రాసేదానికి కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..
మనం ఏ నూనె రాసినా సరే దానిని ముందుగా.. కొద్దిగా గోరువెచ్చగా కాసుకోవాలి..అలా కాచుకొని జుట్టుకు పెట్టుకున్నప్పుడే.. నూనె ఫాస్ట్‌గా స్కాల్ప్‌లోకి వెళ్తుంది.
ఇలాంటి గోరు వచ్చేది నూనె జుట్టుకి పెట్టుకోవడం వల్ల.. బ్లడ్ సర్క్యూలేషన్ కూడా పెరుగుతుంది. ఈ కారణంగా జుట్టు ఆరోగ్యంగా..దృఢంగా పెరిగేందుకు తోడ్పడుతుంది.
ముందుగా ఈ జుట్టుని రెండు సెక్షన్స్‌గా విరదీయాలి. తర్వాత మెల్లిగా వేళ్ళతో.. చిక్కులు తీయాలి. దీని వల్ల నూనె రాయడం ఈజీగా అవుతుంది.
ఇక జుట్టుకి ఆయిల్ అప్లై చేసి ఎంతసేపు పెట్టుకోవాలి అన్న విషయం.. మీ జుట్టు, స్కాల్ప్‌ని బట్టి ఉంటుంది.
మీద డ్రై హెయిర్ అయితే, రాత్రంతా నూనె పెట్టుకున్న పర్లేదు. కానీ, కొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది. అలాంటి వారు ఒక గంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది.