చిప్స్, అప్పడాలు కూడా నూనె లేకుండా చేసుకోవచ్చని మీకు తెలుసా.. మరి అది ఎలానో చూద్దాం..
ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఉప్పు వేసుకొని.. స్టవ్ సిమ్ లో పెట్టుకొని.. వేడి అవ్వనివ్వండి.
ఉప్పు బాగా వేడెక్కాక అందులో చిప్స్, ఒడియాలు లేదా అప్పడాలు.. నూనెలో ఎలాగైతే ఫ్రై చేస్తామో అలానే పైకి కిందికీ చెంచాతో అంటుండాలి.
ఆ ఉప్పు వేడికి.. ఈ చిప్స్, ఒడియాలు లేదా అప్పడాలు వేగిపోతాయి.
ముఖ్యంగా అప్పడాలు వేయించుకునేటప్పుడు.. ఉప్పులోపల మునిగిపోయినట్లు ఉండేలా చూసుకుంటే అవి చాలా తొందరగా వేగిపోతుంది.
అలాగే ఈ ఉప్పు వాడాక.. దానిని అలానే పక్కన తీసి పెట్టుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు.
మీరు ఎప్పుడన్నా పిల్లల కోసం కేకులు, బిస్కట్లు చేస్తున్నప్పుడు ఈ ఉప్పు వాడి వాటిని బేక్ కూడా చేయొచ్చు.