అమ్మాయిలను ఎంతగానో భయపెట్టేవి మొటిమలు.. అవి వచ్చాయి అంటే చాలు మొహంపై మచ్చలను వదలకుండా పోవు..
మరి అలాంటి మొటిమలను పోగొట్టడానికి.. ఒక సులువైన చిట్కా ఉందని మీకు తెలుసా..
ఆ చిట్కా మరేదో కాదు..పింపుల్ ప్యాచెస్. వీటి గురించి మీరు వినే ఉంటారు.
పింపుల్ ప్యాచెస్.. మచ్చలతో సహా మొటిమలను పోగొడుతుంది..
పింపుల్ ప్యాచెస్ ను మనం మొహం పైన..ఎక్కడ మొటిమలు వచ్చాయో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
పింపుల్ పై ఈ ప్యాచెస్ ను రాత్రంతా పెట్టుకోవడం వల్ల..వేగంగా మొటిమలు తొలగిపోయేందుకు సహాయం చేస్తుంది.
అయితే ఈ ప్యాచెస్ ఎలా పనిచేస్తాయి అంటే.. మొటిమల నుండి వచ్చే సెబమ్(ఆయిల్) శోషించడానికి ఈ పింపుల్ ప్యాచెస్ రూపొందించార.
అందుకే వీటిని మొటిమలపై వేసుకోవడం వల్ల.. ఇది వాపు, బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అయితే ఈ ప్యాచెస్ ఓపెన్ లేదా పాప్డ్ మొటిమలపై మాత్రం పని చేయవు.
అంతేకాకుండా.. ఇవి కొంతమందికి వేసుకున్నప్పుడు.. కొంచెం మంటను తేవచ్చు.. కాబట్టి మీకు ఇవి సెట్ అయితేనే వాడంది.