రసగుల్లా అంటే ఎంతో మంది ఇష్టపడుతారు. మరి అలాంటి రసగుల్లా.. మిగిలిపోయిన బ్రెడ్ తో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
ముందుగా మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఆ తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి బాణలిలో పాలు పోసి వేడి చేసుకోవాలి. అందులోనే..నిమ్మరసం వేసి పాలను విరగ్గొట్టాలి.
పాలు విరిగాక .. దాన్ని బాగా వడకట్టి.. పనీర్ మిశ్రమాన్ని వేరు చేసుకోవాలి.
ఆ తరువాత బ్రెడ్ ముక్కలను..ఈ పనీర్ మిశ్రమాన్ని కలుపుకొని.. మిక్సీలో వేసి ఏ రుబ్బుకోవాలి.
ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నీరు, పంచదార వేసి మరిగించుకొని రసగుల్లా సిరప్ తయారు చేసుకోవాలి.
మరుగుతున్న సిరప్ లో ముందుగా సిద్ధం చేసుకున్న లడ్డూలు వేసి.. ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించండి. అంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ రసగుల్లా రెడీ.