అధికంగా నిద్రపోవడం కూడా డేంజరే! పొంచి ఉన్న వ్యాధులు ఇవే!
అతిగా నిద్రపోవడం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరానికి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అంతకుమించి నిద్రపోతే సమయం వృథా.. ఆరోగ్యానికి చేటు కూడా.
తగినంత నిద్ర లేకపోతే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అతిగా నిద్రపోతే కూడా అనారోగ్యం ఏర్పడుతుంది.
అధిక నిద్రతో మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అతి నిద్ర వలన శరీరానికి కావాల్సిన శ్రమ ఉండదు.
వారాంతాల్లో లేదా సెలవుల్లో సాధారణ నిద్ర కంటే ఎక్కువసేపు నిద్రపోతుంటారు. అతి నిద్ర తలనొప్పికి కారణమవుతుంది. దీనివలన వారాంతాలు, సెలవుల్లో వేసుకున్న ప్రణాళికలు దెబ్బతింటాయి.
ఎక్కువగా నిద్రపోవడం లేదా తగినంత నిద్రపోకపోవడం మధుమేహం పొంచి ఉంది. మధుమేహం స్థాయిని పెంచుతుంది.
ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం కూడా బరువు పెరుగుతారు. ఒక నిర్ణీత సమయం ప్రకారం నిద్ర పోతే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.
సాధారణ 7- 8 గంటలు నిద్రపోయే వారు ఆరోగ్యంగా ఉంటారని తేలింది. ఎక్కువ నిద్రపోయే వారు ఊబకాయులుగా తయారవుతారని ఒక అధ్యయనం వెల్లడించింది.