చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది.
Dharmaraju Dhurishetty
May 13,2024
';
ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఆహారాలు తీసుకునే క్రమంలో ఫైబర్ ఎక్కువ మోతాదులో లభించే వాటిని తీసుకోవడం ఎంతో మంచిది. దీంతోపాటు వీరికి మానసిక ప్రశాంతత కూడా ఎంతో కీలకం.
';
అలాగే చెడు కొవ్వు తగ్గించుకోవడానికి ఆహార డైట్లతోపాటు ప్రతిరోజు కొన్ని యోగాసనాలు వేయడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. అయితే ప్రతిరోజు ఎలాంటి యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
';
ఉత్తానాసనం వెయ్యడం వల్ల సులభంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
';
ప్రతిరోజు ధనురాసనం వెయ్యడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. చెడు కొవ్వు కూడా సులభంగా తగ్గుతుంది.
';
ప్రతిరోజు భుజంగాసనం వేస్తే శరీరంలోని కొలెస్ట్రాల్ సులభంగా కరిగిపోతుంది. అలాగే ఊపిరితిత్తుల సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
';
రోజు ఉదయం పూట పచ్చిముత్తాసనం వెయ్యడం వల్ల కూడా పొట్టలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా కలిగించుకోవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల మూత్రపిండాల సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
';
అంతేకాకుండా ప్రతిరోజు సూర్యాసనాలు వేయడం వల్ల కూడా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.