సీడ్స్ అండ్ నట్స్

ప్రతిరోజు ముఖం అందంగా కనిపించడానికి తప్పకుండా బాదం అవిస గింజలు వాల్నట్స్ ఉదయం పూట తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

Dharmaraju Dhurishetty
Apr 28,2024
';

క్యాప్సికం

విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. దీంతో పాటు ముఖంపై ఉన్న మచ్చలు కూడా సులభంగా తొలగిపోతాయి.

';

వెల్లుల్లి

వెల్లుల్లిలో అనేక ఔషధాలు లభిస్తాయి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యంగా ఉంటుంది.

';

గుడ్లు

ముఖం అందంగా కనిపించేందుకు గుడ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గుడ్లలో కొలాజెన్ సమీకరణను మెరుగుపరిచే అనేక గుణాలు ఉంటాయి. కాబట్టి ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకుంటే చర్మం అందంగా మారుతుంది.

';

నారింజ, నిమ్మ పండు

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సిట్రస్ పనులు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ c చర్మానికి శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ముఖంపై సమస్యలు కూడా తొలగిపోతాయి.

';

ఆకుకూరలు

ఆకుకూరలు కూడా శరీరం ఆరోగ్యానికి ప్రభావంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభావవంతంగా తోడ్పడతాయి.

';

అవకాడో

చర్మం అందాన్ని పెంచేందుకు ఆవకాడో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక మోతాదులో విటమిన్ సితో పాటు ఈ కూడా లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.

';

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలు

బెర్రీలను ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి విటమిన్ సి ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. దీనివల్ల తగిన యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story