Skin Whitening: ఇంట్లోనే మీ స్కిన్ పై నల్ల మచ్చలు తొలగించి తెల్లగా మార్చే ఫేస్ ప్యాకులు ఇవే

Bhoomi
Sep 04,2024
';

మెరిసే చర్మం కోసం

అందంగా కనిపించాలని అందరు కోరుకుంటారు. చర్మం తెల్లగా మెరిచేందుకు రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కొన్ని తాత్కాలిక ఫలితాన్ని ఇస్తాయి. అందులోని రసాయనాల వల్ల చర్మానికి హాని కలుగుతుంది.

';

హోం రెమెడీస్

ముఖం మెరిసిపోవడంతోపాటు కాంతివంతంగా చేయడంలో సహాయపడే సహజ గృహ నివారణలు ఉన్నాయి. ఈ పదార్థాలతో మీ ముఖం తెల్లగా, మెరిసిపోయేలా చేసుకోవచ్చు.

';

నిమ్మరసం:

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి చర్మానికి అప్లయ్ చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువచ్చని నీటితో శుభ్రం చేయండి.

';

అలోవెరా:

కలబంద స్కిన్ పిగ్మెంటేషన్‌ను తేలికపరిచి..మొత్తం స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. జెల్‌ను నేరుగా మీ చర్మానికి అప్లై చేయండి. దీన్ని 20-30 నిమిషాలు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోండి.

';

తేనె:

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తేనెను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

';

కీర దోసకాయ:

కీర దోసకాయ రసం తీసి అందులో దూదిని ఉపయోగించి మీ చర్మానికి రసాన్ని పూయండి.15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.

';

బొప్పాయి:

బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పండిన బొప్పాయిని మెత్తని పేస్ట్‌గా మాష్ చేయండి. చర్మానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఉంచి నీటితో శుభ్రం చేసుకోండి.

';

పాలు:

పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది.పచ్చి పాలలో దూదిని ముంచి మీ చర్మానికి అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story