Sobita Dhulipala: ట్రెండ్ అవుతోన్న శోభితా ధూళిపాళ చెవిపోగులు.. ట్రెడిషనల్‎ లుక్‎లో ఆమె తర్వాతే

';

శోభిత ధూళిపాళ్ల

సినీ, ప్యాషన్ ప్రపంచంలో కొత్తదనానికే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దీంతో సినీ జనాలు, మోడళ్లు ఫ్యాషన్ విషయంలో అప్ డేట్ అవుతుంటారు. కొత్త ట్రెండ్స్ ను పరిచయం చేస్తుంటారు.

';

అక్కినేని కోడలు

అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న శోభితా ధూళిపాళ్ల సైతం ప్యాషన్ ప్రపంచాన్ని అనుసరిస్తుంటారు. ఆమె గ్లామరస్ లుక్ తోపాటు ట్రెడిషనల్ లుక్ లోనూ అందర్నీ ఆకట్టుకుంటారు.

';

చెవిపోగులు

శోభితా ధూళిపాళ్ల ధరించిన చీరల నుంచి చెవిపోగుల వరకు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ అమ్మడి నిశ్చితార్థం చీర తెగ వైరల్ అయ్యింది.

';

ప్రింటెడ్ చీరపై చెవిపోగులు

శోభితా జార్జట్ క్లాత్ పై తెల్లని పువ్వులతో డిజైన్ చేసిన చీరకు మ్యాచింగ్ చెవిపోగులు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.

';

ముత్యాల చెవిపోగులు

గోల్డ్ కలర్ చెవిపోగులకు ముత్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఝుంకాలతో అమ్మడు సిగ్గుపడుతుంటే దసరా పండగ ముందే వచ్చినట్లు అనిపిస్తుంది.

';

బ్లాక్ మెటల్ ఝుంకాలు

వైట్ కలర్, ఫుల్ మిర్రర్ వర్క్ తో డిజైన్ చేసిన ఈ జార్జెట్ చీరలో శోభితా క్లాసిక్ లుక్ లో కనిపిస్తోంది. ఈ చీరకు మ్యాచింగ్ గా బ్లాక్ మెటల్ ఝంకాలు ధరించింది.

';

రత్నాల చెవిపోగులు

రెడ్, బ్లూ చెవిపోగులు ధరించిన శోభితా మోడ్రన్ లుక్ పర్ఫెక్ట్ గా ఉంది. సింప్లిసిటీ కొరుకునేవారికి ఇలాంటి చెవిపోగులు బాగా నప్పుతాయి.

';

బంగారు చెవిపోగులు

శోభితా ధరించిన టెంపుల్ డిజైన్ బంగారు చెవిపోగులు అందరికీ నచ్చుతాయి. ఈ మధ్య ఇవే ట్రెండ్. పెళ్లి కూతురు నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఈ చెవిపోగులను ధరిస్తున్నారు.

';

నెలవంక డిజైన్

శోభిత పెట్టుకున్న ఈ ముత్యాల చెవిపోగులు..ఆ చంద్రవంకనే శోభిత చెవులకు పెట్టుకుందా అన్నట్లుగా ఉంది.

';

ముత్యాల కమ్మలు

వైలేట్ కలర్ చీరపై సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్...కొత్త దనం కోరుకునేవారికి బాగుంటుంది. ఈ చీరపైకి ముత్యాలతో డిజైన్ చేసిన చెవిపోగులు శోభితను మరింత అందంగా కనిపించేలా చేసాయి.

';

VIEW ALL

Read Next Story