ఇంట్లో టమాటో సాస్ ఎలా రెడీ చేయాలి?

Dharmaraju Dhurishetty
Aug 07,2024
';

టమాటా సాస్‌ను ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం..

';

మార్కెట్లో లభించే టమాటా సాస్లను ఆహార పదార్థాలలో వినియోగించడం వల్ల రుచి పెరిగినప్పటికీ భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

';

చాలామంది టమాటా సాస్ లో ఎక్కువగా చక్కెరను వినియోగిస్తున్నారు ఎక్కువ చెక్కరితో కూడిన సాసులను వినియోగించడం మంచిది కాదు.

';

ఎప్పటినుంచో మీరు కూడా ఇంట్లోనే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టమాటా సాస్ ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీకోసమే..

';

టమాటో సాస్ కి కావాల్సిన పదార్థాలు: టమాటాలు - 1 కిలో, ఉల్లిపాయ - 1 (తరిగినది), వెల్లుల్లి - 5 రెబ్బలు (తరిగినవి)

';

కావలసిన పదార్థాలు:అల్లం - 1 చిన్న ముక్క (తరిగినది), పచ్చి మిరపకాయలు - 2 (తరిగినవి), జీలకర్ర - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్, మిరియాల పొడి - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఉప్పు - రుచికి సరిపడా, పంచదార - 1 టీస్పూన్ (కావలసిన అంత), వెనిగర్ - 1 టీస్పూన్ (రుచికి సరిపడా )

';

తయారీ విధానం: ఈ సాస్‌ను రెడీ చేసుకోవడానికి ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

ఒక పాన్‌లో వేడి నూనె చేసి, అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

ఆ తర్వాత ఇందులోనే జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి.

';

అన్ని వేసుకున్న తర్వాత టమాట ముక్కలు వేసి, బాగా కలుపుతూ ఉడికించుకోవాలి.

';

టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఉప్పు, పంచదార వేసి మరికొద్దిసేపు బాగా ఉడికించాలి.

';

ఆ తర్వాత వెనిగర్ వేసి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.

';

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోకి తీసుకొని నిల్వ చేసుకుంటే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story