దాదాపు మనం రోజు ఇడ్లీ, దోశలే చేసుకుంటూ ఉంటాం. అయితే వాటికి రోజు పల్లీల చట్నీ తినాలి అంటే బోర్ కొడుతుంది. అందుకే ఇందుకోసం వెరైటీగా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం.
ముందుగా ఐదు టమాటాలను చిన్న ముక్కలుగా.. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక కడాయిలో మూడు స్పూన్ల నూనె.. వేడి చేసుకుని అందులో 8 ఎండు మిరపకాయలను.. వేసి వేయించుకోవాలి.
తరువాత అందులో ఒక టీ స్పూన్.. జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు.. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు.. ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా వేయించుకోవాలి.
ఇవి వేగిన తర్వాత కట్ చేసిన టమోటా.. ముక్కల్ని కూడా అందులో వేయాలి.
అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని..రుచికి సరిపడా ఉప్పు వేసి.. టమాటాలను బాగా వేయించుకోవాలి.
టమాటాలు బాగా మగ్గిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి.
చల్లారిన మిశ్రమాన్ని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.. అంతే ఎంతో రుచికరంగా ఉండే టమోటా చట్నీ రెడీ