Fried Rice: రుచికరమైన సోయా మష్రూమ్ ఫ్రైడ్ రైస్..

Renuka Godugu
Sep 28,2024
';

కావలసిన పదార్థాలు.

ఒక కప్పు ఉడికించిన అన్నం, అర కప్పు సోయా ఉడికించింది, అర కప్పు మష్రూమ్, ఒక ఉల్లిపాయ,అర కప్పు కార్న్ ఒక క్యాప్సికం, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు రుచికి సరిపడా మిరియాలు, కొత్తిమీర ఒక టేబుల్ చిల్లి ఆయిల్.

';

కూరగాయలన్నిటిని సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి.

';

సోయా, కార్న్, మష్రూమ్ 10 నిమిషాల పాటు వేడి నీళ్లలో నాననివ్వాలి.

';

ఓ పాన్ తీసుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి.

';

ఇప్పుడు ఇందులో కట్ చేసిన కూరగాయలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

';

ఆ తర్వాత ఉప్పు సోయాసాస్, వెనిగర్ కూడా వేసి మూడు నిమిషాలు ఉడికించాలి.

';

ఇప్పుడు ఇందులో ఉడికించిన సోయా, మష్రూమ్, కార్న్ వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత రైస్ కూడా వేసి ఉప్పు పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి.

';

బాగా కలిసిన తర్వాత కొత్తిమీర చిల్లి ఆయిల్ పైనుంచి వేసుకుంటే సోయా ఫ్రైడ్ రైస్ రెడీ

';

VIEW ALL

Read Next Story