వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది.ఈ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి హెర్బల్ టీ తాగితే సరిపోతుంది. అలాంటి హెర్బల్ టీ గురించి తెలుసుకుందాం.

';

ప్రాచీన చైనా వైద్యశాస్త్రంలో పేర్కొన్న ఊలాంగ్ టీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తేయాకును ప్రత్యేకమైన పద్ధతుల్లో ఆక్సిడేషన్ చేసి ఈ ఊలాంగ్ టీ పొడి తయారుచేస్తారు.

';

ఊలాంగ్ టీ తాగడం ద్వారా మీరు అనేక రకాల జబ్బుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.

';

ఊలాంగ్ టీ మీ శరీర బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, కెఫిన్ వంటి మూలకాలు మీ శరీరంలో ఉండే కెలరీలను కరిగిస్తాయి

';

ఊలాంగ్ టీ రెగ్యులర్ గా తాగినట్లయితే మీ గుండె ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.ముఖ్యంగా మీ రక్తపోటును కంట్రోల్ చేయడం ద్వారా మీరు గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

';

ఇందులో ఉండే పాలిఫినోల్ యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 డయాబెటిస్ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.తద్వారా మీ శరీరంలో షుగర్ స్థాయి పెరగకుండా చేస్తాయి.

';

ఊలాంగ్ టీ ద్వారా మీ మెదడుకు సంబంధించిన అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.ముఖ్యంగా వయసుతోపాటు వచ్చే మానసిక రుగ్మతల నుంచి ఈ టీ మిమల్ని కాపాడుతుంది.

';

ఈ టీ తాగినట్లయితే మీకు క్యాన్సర్ బారిన కూడా పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు మీ శరీరంలో క్యాన్సర్ కణాలు వ్యాపించకుండా నిరోధిస్తాయి.

';

VIEW ALL

Read Next Story