ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి మిక్సర్ లో వేసి కొద్దిగా నీళ్లు, నిమ్మకాయ రసం వేసి గ్రైండ్ చేయాలి. రుచికరమైన జ్యూస్ రెడీ అవుతుంది. మీకు కావాలంటే మసాలాలు కూడా కలుపుకోవచ్చు.
పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పెంచడంలో దోహదం చేస్తాయి. అలాగే ఒత్తిడి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
పాలకూరతో తయారుచేసిన జ్యూస్ రోజు తాగితే కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ ఆకుకూరల్లోని విటమిన్ ఏ కంటి చూపుతో పాటు రక్తహీనతను నివారించడానికి ఎంతో సహాయపడుతుంది.
చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే రోజు ఓ గ్లాసు పాలకూర జ్యూస్ తాగడం మంచిది. ఈ జ్యూస్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఈ డ్రింక్ మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది.
పాలకుర జ్యూస్ లో సహజంగా లభించే నైట్రేట్లు చాలా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరించడంలో సహాయం చేస్తాయి. తద్వారా మీ రక్తపోటు అదుపులో ఉంటుంది.
పాలకులలో విటమిన్ కె, ఏ, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తాయి. ప్రతిరోజు పాలకుల జ్యూస్ తాగితే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
క్యాన్సర్ వంటి మహమ్మారిని నివారించడంలో పాలకుల జ్యూస్ ఎంతగానో సాయం చేస్తుంది. ఈ ఆకుకూరల్లోని పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
పచ్చని ఆకుకూరలు తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు.
పాలకుర జ్యూస్ లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మలబద్ధకం, కడుపులో పుండ్లు, అల్సర్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.