Purple Cabbage: పర్పుల్ కలర్ క్యాబేజీ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు

Bhoomi
Nov 04,2024
';

పర్పుల్ కలర్ క్యాబేజీ

క్యాబేజీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో అనేక ఆరోగ్య గుణాలు ఉంటాయి. క్యాబేజీలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో పర్పుల్ క్యాబేజీ ఒకటి.

';

పోషకాలు

పర్పుల్ క్యాబేజీలో విటమిన్ సి, ఫొలేట్, ప్రొటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

';

హైపర్ టెన్షన్

పర్పుల్ క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని నాడులను నియంత్రించి హైపర్ టెన్షన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

';

చర్మానికి మేలు

పర్పుల్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మకణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ వ్రుద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.

';

రోగనిరోధకశక్తి

ఈ పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ సి శరీరంలోని ఇమ్యూనిటీ బూస్టుగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.

';

ఎముకలు బలంగా

పర్పుల్ క్యాబేజీ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ కె, పొటాషియం ఎముకల పనితీరును మెరుగుపరుస్తుంది.

';

కీళ్ల నొప్పులు

పర్పుల్ కలర్ క్యాబేజీలో ఉండే పోషకాలు కీళ్ల నొప్పులు, వాపులను కూడా నివారించేందుకు తోడ్పడుతుంది.

';

ట్యాక్సిన్స్

ఈ క్యాబేజీని నిత్యం డైట్లో చేర్చుకున్నట్లయితే శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు పంపేందుకు సహాయపడతాయి. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

';

VIEW ALL

Read Next Story