చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది భారత్ లోకి అడుగుపెట్టింది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కనిపించే సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, అలసట, ముక్కులో ఇబ్బంది, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.
చిన్నపిల్లలు, వ్రుద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
హెచ్ఎంపీవీ వైరస్ నియంత్రించడానికి నివారణ ఒక్కటే మార్గం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
దగ్గి నప్పుడు లేదా తుమ్మేటప్పుడు మీ నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.
షేక్ హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని పెరుగుతుంది.