ఆరోగ్యానికి బాగా కావాల్సిన వాటిల్లో ముఖ్యమైనది మంచి నిద్ర. కానీ నిద్ర పట్టక చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.
నిద్రపోయే ముందు నాటు ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి రెండేసి చుక్కల చప్పున ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.
గసగసాలను దోరగా వేయించి ఒక గుడ్డలో చుట్టి నిద్రపోయే ముందు వాసన చూడాలి.
చేతులతో అరికాళ్ళను కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తో మర్దన చేసుకోవాలి.
మొబైల్స్ వల్ల చాలా రేడియేషన్ ఉంటుంది. కాబట్టి పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి సెల్ ఫోన్లు చూడటం ఆపేయాలి.
శ్వాస మీద ధ్యాస పెట్టి ఓంకారం లేదా ఏదైనా మృదువైన మ్యూజిక్ పెట్టుకుని కళ్ళు మూసుకోవాలి.
ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీకు చక్కగా నిద్ర పడుతుంది. చక్కటి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.