కలబందతో మ్యాజికల్ హెయిర్ వాటర్ తయారు చేసుకోవడానికి అరకప్పు కలబంద జెల్, ఒక కప్పు డిస్టిల్డ్ వాటర్, ఒక స్పూన్ కొబ్బరినూనె, 10 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్
ముందుగా కలబందను బాగా కడిగి గుజ్జును తీసిపెట్టుకోవాలి. దీన్ని ఒక కప్పులో వేసి పెట్టండి.
ఒక బ్లెండర్‌లో ఈ గుజ్జు వేసి బాగా బ్లెండ్ చేయండి స్మూత్ పేస్ట్ మాదిరి తయారవుతుంది. మీకు కావాలంటే మార్కెట్లో రెడీమేడ్ కలబంద కూడా దొరుకుతుంది.
ఈ బ్లెండర్‌లోనే డిస్టిల్డ్ నీరు కూడా పోసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. దీనివల్ల జుట్టు కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది
ఒక స్టెయినర్ సహాయంతో ఈ నీటిని వడగట్టుకోండి. ఇందులోనే ఒక స్పూన్ కొబ్బరి నూనె, రోజ్మెరీ వంటి ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ 10 చుక్కలు కలపాలి.
ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకుని బాగా కలపాలి.
మ్యాజికల్ నీటిని వారానికి రెండుసార్లు జుట్టంతటికీ స్ప్రే చేయండి ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది.
ఎన్‌ఐహెచ్ పరిశోధనల ప్రకారం కలబందలో యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు, విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది.
ఈ నీటిని వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఇది నేచురల్ కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.