స్వీట్ పొటాటో వెజ్ రోల్స్.. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు..

Dharmaraju Dhurishetty
Jul 07,2024
';

స్వీట్ పొటాటో వెజ్ రోల్స్ అంటే అందరు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో వీటివిక్రయాలు జోరుగా పెరుగుతున్నాయి.

';

దీంతో చాలామంది రెస్టారెంట్ల నుంచి ఎక్కువగా ఈ వెజ్ రోల్స్ ను ఆర్డర్ చేసుకొని తింటున్నారు. నిజానికి ఇలా బయట ఫుడ్ తినడం చాలా డేంజర్.

';

ముఖ్యంగా పిల్లలకు ఇలా బయట లభించే స్వీట్ పొటాటో వెజిటల్స్ ఇవ్వడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

';

కాబట్టి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లోనే సులభంగా స్వీట్ పొటాటో వెజ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

స్వీట్ పొటాటో వెజ్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: 1 పెద్ద తీపి బంగాళాదుంప, ఉడికించి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి, 1/2 కప్పు కాలీఫ్లవర్, ఉడికించి, చిన్న ముక్కలుగా, చేసుకోవాలి, 1/2 కప్పు క్యారెట్(తరిగిన), 1/4 కప్పు ఉల్లిపాయ(తరిగిన)

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు కొత్తిమీర (తరిగిన), 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు(తరిగిన), 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1/4 టీస్పూన్ గరం మసాలా, ఉప్పు రుచికి సరిపడా, 10-12 రైస్ పేపర్ షీట్లు, వేయించడానికి నూనె

';

తయారీ విధానం: ఒక గిన్నెలో తీపి బంగాళాదుంప, కాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు కలపాలి.

';

ఇలా వేసిన పదార్థాలన్నింటిని బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత రూల్స్ కోసం కార్న్ ఫ్లోర్ లేదా మైదాపిండిని రోటీల పిండిలాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని రోటిల్లా చిన్నగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులో తగినంత నూనె బటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న కూరగాయ పదార్థాలన్నీ అందులో వేసి వేయించుకోవాలి.

';

ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత రోటీల్లా తయారు చేసుకున్న వాటిలో ఈ కూరగాయల మిశ్రమాన్ని స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

';

గుండ్రకా స్టఫింగ్ చేసుకున్న వెజ్ రోల్స్ ను తీసి సలసల తాగుతున్న నూనె లో వేయాలి.

';

ఇలా నూనెలో బంగారు రంగు వచ్చేంతవరకు బాగా కలుపుతూ వేయిస్తూ రంగు మారిన వెంటనే తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోండి. అంతే సులభంగా హోం మేడ్ వెజ్ రోల్స్ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story