లంచ్ బాక్సుల్లోకి ది బెస్ట్ రెసిపీ.. విటమిన్‌ C రైస్‌ రెసిపీ..

user Dharmaraju Dhurishetty
user Nov 13,2024

ఎంతో సులభమైన రెసిపీల్లో లెమన్ రైస్ ఒకటి. కానీ చాలామందికి దీనిని ఎలా తయారు చేయాలో తెలీదు..

నిజానికి లెమన్ రైస్ శరీరానికి తగిన మోతాదులో కార్బోహైడ్రేట్స్‌తో పాటు సి విటమిన్‌ను అందిస్తుంది.

పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఈ లెమన్ రైస్ అద్భుతమైన రెసిపీగా చెప్పవచ్చు.. ఇందులో వివిధ రకాల పోషకాలు కూడిన కూరగాయలు వేసి తయారు చేసుకుంటే మరింత ఆరోగ్యంగా ఈ రెసిపీ తయారవుతుంది.

ఎంతో సులభంగా ఈ లెమన్ రైస్‌ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి..

లెమన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకోండి..

కావలసిన పదార్థాలు: బాస్మతి అన్నం, నిమ్మకాయ రసం, నూనె, ముక్కలు చేసిన కాయగూరలు (ఉల్లిపాయ, క్యారెట్, బఠానీలు)

మసాలాలు: కరివేపాకు, జీలకర్ర, పసుపు, మిరియాల పొడి, చింతపండు పొడి, ఉప్పు, కొబ్బరి తురుము (కావలసిన పదార్థాలు)

తయారీ విధానం: లెమన్ రైస్‌ని తయారు చేసుకోవడానికి ముందుగా బాస్మతి రైస్ ని ఉడికించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత స్టౌవ్‌పై ఓ మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకుని జీలకర్ర, కరివేపాకు వేసి వాసన వచ్చే వరకు వేయించండి. తరువాత ముక్కలు చేసిన ఉల్లిపాయ, క్యారెట్, బఠానీలు వేసి వేయించాలి.

ఆ తర్వాత పసుపు, మిరియాల పొడి, చింతపండు పొడి వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోండి.

ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా కావలసినంత నిమ్మరసం, ఉప్పు వేసుకుని, కావాలి అనుకుంటే కొద్దిగా కొబ్బరి తురుము వేసుకొని బాగా హై ఫ్లేమ్ పై కలుపుకోండి.. అంతే హెల్తి లెమన్ రైస్ రెడీ అయినట్లే..

VIEW ALL

Read Next Story