ఈ లక్షణాలు ఉంటే మీ గుండె ఫెయిల్‌ అయినట్లే

user Dharmaraju Dhurishetty
user Nov 13,2024

నిజానికి చాలామందిలో గుండె సమస్యలు వచ్చే ముందు బాహ్య శరీరంపై అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

కొంతమందిలో తరచుగా గుండె సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వీటిని లైట్ తీసుకుంటే ఇక పూర్తిగా జీవితాన్నే వదులుకోవాల్సి వస్తుంది.

కొంతమందిలో చిన్న చిన్న గుండె సమస్యలకు దారితీసి.. పూర్తిగా గుండె ఫెయిల్ అవుతోంది. నిజానికి దీనికి సంబంధించిన లక్షణాలను గుర్తించడం చాలా కష్టం..

కొంతమందిలో గుండె ఫెయిల్ అయ్యే ముందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.

ముందుగా గుండె ఫెయిల్ అయిన తర్వాత వచ్చే లక్షణాలు ఒకటి ఊపిరి తీసుకోవడంలో అనేక ఇబ్బందులు రావడం. అంతేకాకుండా ఒక్కసారిగా మూర్చ వంటి సమస్యలు రావడం.

ముఖ్యంగా చాలామందిలో గుండె ఫెయిల్ అయిన తర్వాత కాళ్లకు వాపులు కూడా వస్తూ ఉంటాయి. వీటిని ముందుగానే గమనించి చికిత్స పొందడం చాలా మంచిది.

మరికొంతమందిలోనైతే ఎప్పుడు అలసట, కళ్ళు తిరగడం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.

ఇక గుండె ఫెయిల్ అయ్యే ముందు కొంతమందిలోనైతే గుండె స్పందనలో కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరికొంతమందిలోనైతే గుండె సమస్యలు రావడానికి ముందే కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొంతమందిలోనైతే గుండె సమస్యలు వచ్చే తరుణంలో చర్మంపై రంగు కూడా మారుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

VIEW ALL

Read Next Story