జుట్టు పొడవుగా, దృఢంగా పెరగాలని కోరుకుంటే.. ఆహారంలో పోషకాలు ఉన్న కూరగాయలను.. తప్పకుండా మీ ఆహారంలో చేర్చాలి. ముఖ్యంగా పాలకూర ఎంతో ముఖ్యమైనది అంటున్నారు వైద్యాన్నిపూర్ణులు.
పాలకూరలో విటమిన్ A, సి, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల వేగంగా జరుగుతుంది.
పాలకూరలో ఉండే ఐరన్ జుట్టు.. ఊడిపోకుండా నిరోధిస్తుంది.
దీనిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. వెంట్రుకలకు కావలసిన బలాన్ని అందిస్తాయి.
పాలకూర తినడం.. జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.
రోజు పాలకూరను కూరగానో లేదా జ్యూస్ రూపంలోనో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. పాలకూరను రెగ్యులర్ డైట్ లో చేర్చడం తప్పనిసరి.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.