ఈ లక్షణాలు ఉంటే.. గుండెపోటు రావడం ఖాయం..

TA Kiran Kumar
Aug 30,2024
';


గుండెపోటుకు సంబంధించిన ఐదు సంకేతాలతో గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చు.

';


గుండె పోటు వచ్చే సమయంలో ఛాతీ మధ్య భాగంలో ఒత్తిడి. మరోవైపు ఛాతి పిండేసినట్టుగా కొన్ని నిమిషాల పాటు అనిపించడం వంటివి ముఖ్య లక్షణాలుగా గుర్తించాలి.

';


ఛాతిలో నొప్పి కారణంగా అసౌకర్యంగా అనిపించడం. ముఖ్యంగా గుండెపోటు వచ్చే సమయంలో భుజాలు, మెడ, చేతులు, వీపు లేదా దవడ వంటివి ఎడమ వైపు లాగడం వంటివి గుండెపోటుకు ముఖ్య సంకేతాలుగా భావించాలి.

';


శ్వాస లేదా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటివి హార్ట్ ఎటాక్ కు సంబంధించిన లక్షణాలుగా గుర్తించవచ్చు.

';


గుండెపోటుకు ముందు ఊపిరి ఆడకపోవడం.. కడుపులో వికారం, వాంతులు, మైకము, మూర్ఛ వంటివి కూడా ముఖ్య లక్షణాలుగా గుర్తించాలి.

';


ముఖ్యంగా ఛాతిలో నొప్పితో పాటు చలిలో కూడా చెమటలు పట్టడం వంటివి కూడా హార్ట్ ఎటాక్ కు సంకేతాలుగా భావించాలి.

';


సకాలంలో వైద్య సహాయం కోసం ఈ లక్షణాలను ముందుగా గుర్తిస్తే గుండెపోటుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యమైనది.

';


ఈ కంటెంట్ ఇంటర్నెట్ లో ఉన్న సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. గుండెపోటుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించడం బెటర్.

';

VIEW ALL

Read Next Story