Insta Blue Tick Tips: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త, బ్లూటిక్ ఫ్రీగా పొందాలంటే ఇలా చేయండి చాలు
ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ పొందాలంటే మీ ఎక్కౌంట్లో పూర్తి సమాచారం ఉండాలి. అంటే మీ పేరు, బయోడేటా, ప్రొపైల్ ఫోటో ఇలా అన్నీ ఉండాలి
ఎక్కౌంట్ ఎప్పుడూ అప్ డేటెడ్ ఉండాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా పోస్టింగులు చేస్తుండాలి
ఎక్కౌంట్ యాక్టివ్ ఉంచాలి. మీ పోస్టులకు వచ్చే కామెంట్లకు ఆన్సర్ ఇస్తుండాలి. దాంతోపాటు ఇతరుల పోస్టింగులపై కూడా మీ స్పందన ఉండాలి
మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బాగుండాలి. ఇందులో ఎక్కౌంట్ లింక్, సోషల్ మీడియా లింక్, కాంటాక్ట్ సమాచారం ఉండాలి
ఇక ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం అప్లై చేయాలి
దీనికోసం ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ క్లిక్ చేయాలి
సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎక్కౌంట్ లో వెళ్లాలి. తరువాత రిక్వెస్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి
బ్లూ టిక్ కోసం అప్లై చేసేటప్పుడు మీ ఎక్కౌంట్ వివరాలు పూర్తిగా ఇవ్వాలి. అంటే మీ పేరు, బయోడేటా, ప్రొఫైల్ ఫోటో వంటివి
ఆ తరువాత ఇన్స్టాగ్రామ్ మీ రిక్వెస్ట్ రివ్యూ చేస్తుంది. 24 గంటల్లో మీకు మెస్సేజ్ వస్తుంది
మీ రిక్వెస్ట్ ఆమోదమైతే మీకు బ్లూ టిక్ లభిస్తుంది.