ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు జీన్స్ వేసుకుంటారు.
మార్కెట్ లలో రకరకాల జీన్స్ లు అందుబాటులో ఉన్నాయి.
దీనిలో స్కిన్ టైట్ అని, లూజ్ ప్యాంట్ అని, అనేక వెరైటీల్లో దొరుకుతాయి.
అయితే.. ప్రతి ఒక్క జీన్స్ లలొ తప్పకుండా చిన్న పాకెట్ ఉంటుంది.
ఈ చిన్న పాకెట్ 1800 సంవత్సరంలో మొదటి సారి కుట్టారంట.
అప్పట్లో ఈ జేబుని వాచ్ పాకెట్ అని, దీనిలో వాచీలు పెట్టుకునే వారంట.
గతంలో ఈ జేబులు కాస్త పెద్దవిగా ఉంటే, ఇప్పుడు మాత్రంసైజ్ తగ్గిపోయింది.
ఇప్పుడు కాయిన్స్ లు, ముఖ్యమైన డాలర్ లు దీనిలో పెట్టుకుంటున్నారంట.
ఈ జీన్స్ ను లెవీ స్ట్రాస్ క్రియేట్ చేశాడని చెబుతుంటారు.