పాము కాటు విష ప్రభావాన్ని తగ్గించే ఈ పండు గురించి తెలుసా..
ఈ పండు పాము విషం ప్రభావాన్ని తగ్గిస్తుందనేది గిరిజనులు విశ్వసిస్తారు.
ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. ముఖ్యంగా పాము కాటుకు గురైతే.. ఏం చేయాలో సామాన్య జనాలకు తెలియదు.
కానీ జార్ఖండ్‌లోని గిరిజనులకు ఇప్పటికీ పాము కాటుకు విషం బారిన పడకుండా వాళ్ల దగ్గు ఎన్నో దివ్య ఔషధాలున్నాయి.
అయితే పాములు మరియు తేళ్ల విష ప్రభావం తగ్గించే పండు ఇక్కడ ఉండే కొంత మంది గిరిజనులకు మాత్రమే తెలుసు.
సామాన్యంగా తినని ఈ పండు పేరు ఆషాఢి ఫలం అని పేరు..
ఈ పండు బొకారో అడవులలో ఉన్న చిన్న ముళ్ల చెట్లపై కనిపిస్తుంది.
ఇది పాము కాటుకు విరగుడుకు అద్భుత ఫలమని గిరిజనులు నమ్ముతారు. దీని శాస్త్రీయ నామం Mayra laxiflora.
పూర్వకాలంలో గిరిజనులు పొలాలకు వెళ్లే ముందు ఈ పండును తినేవారట. ఒకవేళ పాము కాటుకు గురైన ఇది విరుగుడుగా పనిచేసేది.
ఈ పండు తిన్న తర్వాత పొలాల్లో పని చేస్తున్నప్పుడు తేలు లేదా పాము కాటేస్తే విష ప్రభావం తగ్గుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అది ఎన్నో సందర్భాల్లో ఋజువు అయింది.
తరచుగా, గిరిజనులు అడవులలో తిరుగుతూ ఉంటారు. ఈ సందర్బంగా పాములు లేదా తేళ్లు కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ పండు తింటే పాము కాటు నుంచి రక్షించబడతారనేది గిరిజనుల నమ్మకం మాత్రమే. దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. విషాన్ని తగ్గించే శక్తి ఈ పండుకు లేదనే వాదన ఉంది.
మరోవైపు ఆషాఢ ఫలం జీర్ణశక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రీయ ఆధారాల్లో తేలాయి.