ఎండా కాలంలో వేడిని తట్టుకోలేక పాములు ఇళ్లల్లోకి వచ్చేస్తుంటాయి.

user Samala Srinivas
user Apr 27,2024

ఒక్కోసారి కన్నంలోకి దూరి ఉండిపోతాయి. వాటిని ఎలా బయటకు తీయాలో మనకు తెలియదు.

మేము ఇప్పుడు చెప్పబోయేది వింటే పాములు మీ దరిదాపుల్లోకి కూడా రావు, ఒకవేళ వచ్చినా వాటిని ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఎక్కడా కలప, ఇటుకలు, పాత వస్తువులు వంటివి పేర్చవద్దు, ఎందుకంటే వీటిలోనే పాములు నక్కే అవకాశం ఉంది.

పాము మీ ఇంట్లోకి ప్రవేశించి ఏదైనా మూలలో దాక్కున్నట్లయితే, మీరు మీ వంటగదిలో ఉంచిన కొన్ని వస్తువులను స్ప్రే చేయడం ద్వారా దాన్ని తరిమికొట్టవచ్చు.

నవరత్న ఆయిల్ వంటి ఘాటైన వాసన గల హెయిర్ ఆయిల్‌ను ఆ ప్రదేశంలో స్ప్రే చేస్తే పాము కంగారుపడి బయటకు వెళ్లిపోతుంది.

అంతే కాకుండా ఫినైల్, బేకింగ్ పౌడర్, ఫార్మాలిన్, కిరోసిన్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల పాములు ఎవరికీ హాని కలగకుండా మీ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాయి.

ఈ పదార్థాలన్నీ నీటిలో కలిపి ఇంట్లోకి ప్రవేశించిన పాముల చుట్టూ చల్లితే అవి బయటకు వెళ్లిపోతాయి.

మీరు దాని దాక్కున్న ప్రదేశం చుట్టూ HIT లేదా ఏదైనా ఇతర పురుగుమందును కూడా పిచికారీ చేయడం వల్ల ఆ వాసన భరించలేక బయటకు వెళ్లిపోతాయి.

VIEW ALL

Read Next Story