ఆచార్య చాణక్యుడు కోపోద్రిక్తుడైన వ్యక్తిని మరింత కోపానికి గురి చేయవద్దని చెప్పారు. ఇది అగ్నికి ఆజ్యం (నెయ్యి) జోడించడం వంటిది. అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఇంద్రియాలను అదుపులోకి ఉంచుకోవాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. ఏదైనా ప్రతికూల పరిస్థితుల ఏర్పడినపుడు మనసుతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
జీవితంలో ప్రాణం పోయే పరిస్థితులు ఎదురైన అబద్దాళను ఆడవద్దు. ఒక అబద్దాన్ని దాచడానికి ఎన్నో అబద్దాలు ఆడాల్సి వస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోయే అవకాశాలున్నాయి.
చాణక్య నీతి ప్రకారం తెలివైన వ్యక్తి.. బుద్ధిమంతులు.. పెద్దవాల్ల సలహాలు సూచనలు తీసుకోనిదే ఏ పని మొదలు పెట్టరు. కాబట్టి, మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.
Disclaimer: ఈ వార్త మీకు తెలియజేసే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాయబడింది. ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా మేము ఈ విషయాలను ప్రస్తావించాము. చాణక్య నీతి పుస్తకంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించాము.