శ్రీరామ నవమి రోజున తెల్లవారుజామున లేచి, పవిత్రమైన స్నానం చేసి ఈ రోజును ప్రారంభించాల్సి ఉంటుంది.
మీ ఇంట్లో శ్రీరాముని విగ్రహాన్ని స్థాపించి, ప్రత్యేకంగా అభిషేకం చేసి పూజ చేయాల్సి ఉంటుంది.
"ఓం రామ జయ రామ జయ జయ రామ" అనే శ్రీరామ మంత్రాన్ని జపించండి.
శ్రీరామ నవమి రోజున శ్రీరామ చరిత్ర చదవడం చాలా మంచిది. ఇలా చదివితే శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుంది.
శ్రీరామ నవమి రోజున దానం చేయడం చాలా పుణ్యకార్యం. మీరు మీ స్థోమతను బట్టి బియ్యం, పప్పు, నూనె, బట్టలు లేదా డబ్బును దానం చేయవచ్చు.
కొంతమంది భక్తులు శ్రీరామ నవమి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఉపవాసాలు పాటించని వారు పండ్లు తినొచ్చు.
మీ ప్రాంతంలో జరిగే శ్రీరామ నవమి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల పుణ్యం లభిస్తుంది.
కొంత సమయం కేటాయించి రామ నామం పటిస్తూ ధ్యానం చేయండి.