ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా జరిగిన 11వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.

';

సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అయితే గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

';

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ తరఫున రషీద్‌ ఖాన్‌కు ఒక వికెట్ లభించింది.

';

విధ్వంసక బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్‌ను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

';

ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన క్లాసెన్ ఈ మ్యాచ్ లో ఆ ఫీట్ ను అందుకోలేకపోయాడు. అతడు కేవలం 24 పరుగులే చేసి ఔటయ్యాడు.

';

క్లాసెన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 67 పరుగులు మరియు ముంబై ఇండియన్స్‌పై 80* పరుగులు చేశాడు.

';

క్లాసెన్‌ను ఔట్ చేయడం ద్వారా రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు.

';

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ నిలిచాడు.

';

గుజరాత్‌ తరఫున ఐపీఎల్‌లో 49వ వికెట్‌ తీసిన రషీద్‌ ఖాన్‌ మహమ్మద్‌ షమీ రికార్డును బద్దలు కొట్టాడు.

';

గుజరాత్ తరఫున షమీ 48 వికెట్లు పడగొట్టాడు, గాయం కారణంగా అతను ఈ సీజన్‌లో ఆడడం లేదు.

';

VIEW ALL

Read Next Story