రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ చరిత్ర సృష్టించాడు.

';

ఈ మ్యాచ్‌లో మయాంక్ తన 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ అద్భుత ప్రదర్శనకు అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

';

మాక్స్‌వెల్, గ్రీన్ మరియు పాటిదార్‌ల వికెట్లు తీసిన ఈ 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ లక్నో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

';

వేగవంతమైన బాల్ బౌలింగ్: ఈ ఐపీఎల్‌లో మయాంక్‌కి ఇది కేవలం రెండవ మ్యాచ్ మాత్రమే. ఈ మ్యాచ్ లో అతడు 2024లో 156.7 కిమీ వేగంతో బంతిని వేసి రికార్డు సృష్టించాడు.

';

మెుదటి రెండు మ్యాచ్‌లలో ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి ఆటగాడుగా మయాంక్ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను ఈ అవార్డును గెలుచుకున్నాడు.

';

ఇప్పటి వరకు 16 మంది ఆటగాళ్లు తమ ఐపీఎల్ అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడు మయాంక్.

';

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ అరంగేట్రంలోనే మయాంక్ మూడు వికెట్లు తీశాడు.

';

ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలవడంతో మయాంక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా భారత్ తరపున ఆడాలనే తన కోరికను వెల్లడించాడు.

';

లక్నో వరుసగా రెండు మ్యాచులు గెలవడంతో మయాంక్ గాల్లో తేలిపోయాడు. దేశం తరపున ఆడటమే తన లక్ష్యం అని పేర్కొన్నాడు.

';

VIEW ALL

Read Next Story