ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ గురించి మీకు తెలిసి ఉండాలి, అయితే నెమ్మదిగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరో తెలుసా?

Samala Srinivas
Apr 03,2024
';

జేపీ డుమిని:

ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమిని అత్యంత నెమ్మదిగా అర్ధ సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 2009లో ముంబై తరఫున ఆడుతున్నప్పుడు పంజాబ్ కింగ్స్‌పై 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

';

పార్థివ్ పటేల్:

భారత మాజీ ఓపెనర్ పార్థివ్ పటేల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

';

2010లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 53 బంతుల్లో 50 పరుగులు చేశాడు పార్థివ్. అయితే అతడు సీఎస్కే తరపున ఆడాడు.

';

బ్రెండన్ మెకల్లమ్:

మూడో స్థానంలో విధ్వంసక బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ ఉన్నాడు. అతడు ఈ లిస్ట్ లో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

';

కేకేఆర్ తరపున 2010లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

';

రాబిన్ ఉతప్ప:

ఈ జాబితాలో రాబిన్ ఉతప్ప నాలుగో స్థానంలో ఉన్నాడు. 2012లో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

';

రాబిన్ ఉతప్ప పూణె వారియర్స్ తరపున ఆడుతున్నప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)పై ఈ అర్ధశతకం సాధించాడు.

';

గౌతమ్ గంభీర్:

ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ గౌతమ్ ఐదో స్థానంలో ఉన్నాడు. 2010 ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు ఆడుతున్నప్పుడు.. అతను చెన్నై సూపర్ కింగ్స్‌పై 51 బంతుల్లో యాభైని పూర్తి చేశాడు.

';

VIEW ALL

Read Next Story