Labour Day 2024: నేటితరానికి 'మే డే' అంటే సెలవు రోజు అనే తెలుసు. కానీ మే డే అనే రోజుకు ఎంతో ఘన చరిత్ర ఉంది.
Labour Day 2024: మే డేను ప్రపంచ చరిత్రలో రక్త అక్షరాలతో లిఖించిన రోజు.
Labour Day 2024: నాడు కార్మికులు రక్తమాంసాలు ధారపోసి పోరాటం చేయడంతోనే నేడు ఉద్యోగులు అతి తక్కువ పని గంటలు, అధిక వేతనాలు పొందుతున్నారు.
Labour Day 2024: అమెరికాలోని షికాగో నగరంలోని హే మార్కెట్‌లో 1 మే 1886న కార్మికుల భారీ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనతో ప్రభుత్వాలు దిగివచ్చి కార్మికుల డిమాండ్లు నెరవేరాయి.
Labour Day 2024: కార్మికుల శ్రమకు తగ్గ గుర్తింపు.. వేతనం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో 1880 నుంచి కార్మికులు ఉద్యమం తీవ్రం చేశారు.
Labour Day 2024: కారల్ మార్క్స్ ఇచ్చిన 'ప్రపంచ కార్మికుల్లారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప' అనే నినాదం స్ఫూర్తితో కార్మికులు ఉద్యమం చేపట్టారు.
Labour Day 2024: కార్మికులకు 8 గంటల పనివిధానం కోసం షికాగాలో కార్మికులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. చాలా మంది కార్మికులు పోలీసు కాల్పుల్లో మరణించారు.
Labour Day 2024: మే డే ఉద్యమం ఫలితంగా వచ్చిన 8 గంటల పని, శ్రమకు తగ్గ వేతనం అమలవగా.. ప్రస్తుతం అవి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రైవేటు కంపెనీల్లోనే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అధిక పని గంటలు పని చేస్తున్నారు.
Labour Day 2024: ఈ పోరాటం చేయడం ద్వారానే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న 8 గంటల పనివిధానం అమల్లోకి వచ్చింది. అనంతరం ప్రపంచదేశాల్లో అంతటా 8 గంటల పనివిధానం అమలు చేశారు.
Labour Day 2024: 'మే డే'ను ప్రతి దేశంలో పరిగణిస్తున్నారు. ఆ రోజు కార్మికులు, ఉద్యోగ సంఘాలు నాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటారు. కార్మికుల త్యాగాలను నెమరువేసుకునే రోజు ఇది.